
DSports 22 Nov :టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అసాధారణమైన, అభేద్యమైన రికార్డుగా నిలిచిన ఇంగ్లండ్ దిగ్గజ ఆఫ్-స్పిన్నర్ జిమ్ లేకర్ ఒకే టెస్ట్ మ్యాచ్‌లో 19 వికెట్లు పడగొట్టిన ఘనత నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. సరిగ్గా 69 సంవత్సరాల క్రితం, 1956లో ఆస్ట్రేలియాపై లేకర్ సాధించిన ఈ అద్భుతమైన ఫీట్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.క్రికెట్ చరిత్రలో ‘బాహుబలి’ రికార్డుగా పరిగణించబడే ఈ మైలురాయిని అధిగమించడం ప్రస్తుత తరం బౌలర్లకు కూడా అసాధ్యంగా మారింది.
1956లో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో, జిమ్ లేకర్ తన స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను చిన్నాభిన్నం చేశాడు.తొలి ఇన్నింగ్స్‌లో లేకర్ 9 వికెట్లు పడగొట్టి (9/37) అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. మరో వికెట్‌ను స్పిన్నర్ టోనీ లాక్ తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 84 పరుగులకే కుప్పకూలింది.ఫాలో-ఆన్ ఆడిన ఆస్ట్రేలియాకు రెండో ఇన్నింగ్స్‌లో కూడా లేకర్ చుక్కలు చూపించాడు. ఈసారి అతను ఏకంగా 10 వికెట్లు (10/53) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.ఈ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి జిమ్ లేకర్ కేవలం 90 పరుగులు ఇచ్చి 19 వికెట్లు (19/90) తీశాడు. ఈ ప్రదర్శనతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 170 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
