DSports 22 Nov :ముంబై:భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన త్వరలో బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను వివాహమాడబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తనకు కాబోయే భర్త నుంచి స్మృతి మంధానకు ఊహించని, అత్యంత రొమాంటిక్ సర్‌ప్రైజ్ ప్రపోజల్ అందింది.

దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట నవంబర్ 23, 2025 (ఆదివారం) వివాహ బంధంతో ఒక్కటి కానుంది. పెళ్లికి కొద్ది రోజుల ముందు, పలాష్ ముచ్చల్ తన ప్రియురాలికి మరుపురాని అనుభూతిని ఇచ్చాడు.