
DNews: Nov21: దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. శుక్రవారం దుబాయ్ ఎయిర్ షోలో ప్రదర్శన సందర్భంగా భారతీయ తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది.
భారత్ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ మరియు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన తేజస్ ఫైటర్ జెట్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో ఎయిర్ షోలో కూలిపోయింది. ఫైటర్ జెట్ కూలిపోయిన తర్వాత, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కనిపించింది. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? లేక పైలట్ తప్పిదమా? ఇది ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, పైలట్ భద్రతకు సంబంధించి భారత వైమానిక దళం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
