
DET:NOV 20:
చిలక అని పిలిచినందుకు దర్శకుడిపై దివ్యభారతి ఆగ్రహం!
నటి దివ్యభారతి ఇటీవల ఒక సినీ దర్శకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.మా నాన్న కూడా నన్ను అలా పిలవలేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.ఇంతకీ ఏం జరిగింది?దివ్యభారతి హీరోగా నటించిన తాజా చిత్రం హరి అంకుష్ ప్రమోషన్స్ సందర్భంగా ఈ వివాదం మొదలైంది.
దర్శకుడు నరేష్ కుప్పిలి వివాదాస్పద వ్యాఖ్య:
ఈ సినిమా దర్శకుడు నరేష్ కుప్పిలి ఒక ప్రెస్ మీట్లో దివ్యభారతి గురించి మాట్లాడుతూ,ఆమెను ముద్దుగా చిలక అని సంబోధించారు.ఈ మాటలు దివ్యభారతికి అస్సలు నచ్చలేదు.వెంటనే ఆమె తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి పదజాలం వాడటం సరికాదని,ఒక నటిని లేదా ఎవరినైనా వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడకూడదని దర్శకుడికి గట్టిగా చురకలు అంటించింది.
సుడిగాలి సుధీర్ మౌనంపై దివ్యభారతి ప్రశ్నలు:
ఈ వివాదం మరింత పెద్దదైంది.ఇదే ప్రెస్ మీట్లో హీరో సుడిగాలి సుధీర్ కూడా పక్కనే ఉన్నారు. దర్శకుడు ‘చిలక’ అని పిలిచినప్పుడు సుధీర్ కనీసం అడ్డుకోలేదు,కనీసం స్పందించలేదు.దీనిపై దివ్యభారతి మీడియా సమావేశంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఒక అమ్మాయిని అలా పిలిచినప్పుడు,పక్కనే ఉన్న కో-స్టార్ సుధీర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?ఎందుకు ఖండించలేదు? అని ఆమె సూటిగా ప్రశ్నించింది.
సినీ పరిశ్రమలో మర్యాదపై చర్చ:
దివ్యభారతి చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మహిళల పట్ల ప్రవర్తించే విధానంపై,మర్యాదగా మాట్లాడవలసిన అవసరంపై కొత్త చర్చకు తెర తీశాయి.ఒక నటిగా తన హక్కుల గురించి,అలాగే ఇతర మహిళల గౌరవం గురించి ఆమె ధైర్యంగా మాట్లాడటంపై చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నా,బహిరంగ వేదికలపై ఒకరితో మాట్లాడేటప్పుడు తప్పకుండా హద్దులు పాటించాలని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.
