
DET:NOV 18:
ధూరంధర్ ట్రైలర్ లాంచ్‌లో మెరిసిన తారలు:
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్,ఆర్.మాధవన్,అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ధూరంధర్ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ముంబైలో అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఈ ముగ్గురు అగ్ర నటులు హాజరై సందడి చేశారు. బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్‌తో స్టైలిష్‌గా కనిపించిన రణ్వీర్ సింగ్ అందరి దృష్టిని ఆకర్షించారు.అతనికి తోడుగా ఆర్. మాధవన్,అర్జున్ రాంపాల్ కూడా పవర్-ప్యాక్డ్ లుక్స్‌తో దర్శనమిచ్చారు.ఈ ముగ్గురూ కలిసి ఫోటోలకు ఫోజులివ్వడం,స్టేజిపై సరదాగా మాట్లాడటం ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
ధూరంధర్ ట్రైలర్: ఉత్కంఠభరిత యాక్షన్ డ్రామా:
ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తీసిన దర్శకుడు ఆదిత్య ధర్ నుండి వస్తున్న ఈ ధూరంధర్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచింది.ట్రైలర్ చూసిన తర్వాత,ఇది సరిహద్దు దేశాల ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ నేపథ్యంతో,నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది.Wrath of God అనే పేరుతో రణ్వీర్ సింగ్ ఒక రా ఏజెంట్‌గా భీకరమైన యాక్షన్ పాత్రలో కనిపించారు.ఆర్.మాధవన్ ఒక కీలక ఇంటెలిజెన్స్ అధికారిగా సీరియస్ రోల్లో కనిపించారు,ఆ పాత్ర నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌ని పోలి ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.అర్జున్ రాంపాల్ ఒక నెగటివ్ రోల్లో మెరిసి,కథలో ఉత్కంఠను పెంచారు.
నటుల మధ్య ప్రశంసలు,చిత్ర విశేషాలు:
ట్రైలర్ విడుదల సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో నటీనటులు పరస్పరం అభినందించుకున్నారు.ముఖ్యంగా అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ,రణ్వీర్ సింగ్ ఈ పాత్ర కోసం రెండు సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడో నేను చూశాను.షూటింగ్లో ఒక్కసారి కూడా రణ్వీర్ సింగ్‌ని చూడలేదు,నాకు హమ్జా మాత్రమే కనిపించాడు.ఇది నిజంగా అద్భుతం.ఈ చిత్రం యుగయుగాలుగా నిలిచిపోతుంది అంటూ రణ్వీర్ అంకితభావాన్ని కొనియాడారు.ఆర్.మాధవన్ కూడా ఈ సినిమా కోసం తన లుక్‌ను గుర్తుపట్టలేనంతగా మార్చుకున్నానని సరదాగా చెప్పారు.అక్షయ్ ఖన్నా,సంజయ్ దత్ వంటి ఇతర సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు,అయితే వారు కొన్ని కారణాల వలన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఈ దేశభక్తి,యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
