D Spiritual: Nov 18: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుగువారికి కొత్త సంవత్సరం అంటే ఉగాదితో ప్రారంభమవుతుంది. అయితే కాలానుగుణంగా నేటి తరం ఆంగ్ల నూతన సంవత్సరాన్నే ఘనంగా జరుపుకుంటున్నారు. అంతేకాదు కొత్త ఏడాదికి సంబంధించిన కొన్ని శుభనమ్మకాలను కూడా పాటిస్తున్నారు. కొత్త సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో, ఇంట్లో కొన్ని మొక్కలను నాటడం వల్ల సంవత్సరం మొత్తం శ్రేయస్సు, ఆనందం, ఐశ్వర్యం, సానుకూల శక్తి పెరుగుతుందని జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం సూచిస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా ఈ మొక్కలతో నశించిపోతుందని నమ్ముతారు.

కొత్త సంవత్సరం తమ జీవితాల్లో సంపద, ఆరోగ్యం, విజయాలను తీసుకురావాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం, కొత్త సంవత్సరం ప్రారంభంలో కొన్ని పవిత్ర మొక్కలను ఇంటి వద్ద పెంచుకోవడం చాలా శుభకరంగా భావిస్తారు. ఈ మొక్కలు సంవత్సరం మొత్తం సిరిసంపదలు, శాంతి, సానుకూల శక్తిని అందిస్తాయని చెబుతారు. ఇక కొత్త సంవత్సరంలో ఏ మొక్కలను ఇంట్లో నాటితే శుభం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.

తులసి మొక్క: హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభకరం. తులసి ఇంట్లో ఉండడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం దక్కుతుందని, ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్మకం.

జమ్మి మొక్క: వాస్తు శాస్త్రం ప్రకారం జమ్మి మొక్కను ఇంట్లో పెంచుకోవడం అత్యంత శుభప్రదం. ఈ మొక్కను నాటడం ద్వారా శివుడు, శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. శని దోషం ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఇది ఇంటికి శాంతి, శ్రేయస్సు, ఆధ్యాత్మిక శక్తిని తీసుకువస్తుంది.

మనీ ప్లాంట్: వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఆర్థిక పురోగతికి ముఖ్య సూచకం. దీనిని ఇంట్లో ఆగ్నేయ మూలలో పెట్టడం ఎంతో శ్రేయస్కరం. మనీ ప్లాంట్ సమృద్ధి, సంపద, ఆర్థిక స్థిరత్వానికి సంకేతంగా పరిగణించబడుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ మొక్కను ఇంటికి తేవడం మంచి శుభాన్ని ఆకర్షిస్తుంది.

జిల్లేడు మొక్క: శ్వేతార్క లేదా జిల్లేడు మొక్క గణపతికి ప్రీతికరమైనదిగా చెప్పబడుతుంది. ఇంట్లో ఈ మొక్కను పెంచడం వల్ల సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. అలాగే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని తొలగించడంలో ఈ మొక్క చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో ప్రతికూల శక్తులను దూరం చేసుకోవాలనుకునే వాళ్లు ఈ మొక్కను తప్పకుండా నాటాలి.

క్రాసుల (జేడ్) మొక్క: వాస్తు ప్రకారం జేడ్ మొక్క సానుకూల శక్తిని పెంచే శుభమొక్క. ఇంట్లో జేడ్ మొక్కను నాటడం ద్వారా ప్రతికూల శక్తి తగ్గి, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. పురోభివృద్ధి, సంపద ఆకర్షణ కోసం కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ మొక్కను పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana