D Spiritual: Nov 18: అరుణాచలంలో అఖండ జ్యోతి వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది

మహా దీపోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్‌ హైకోర్టు ప్రభుత్వం, డీజీపీ, జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లపై పూర్తి నివేదికను సమర్పించాలని కూడా కోర్టు కోరింది.

తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 7 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. 1,667 అడుగుల ఎత్తైన అరుణాచల గిరిపై జరిగే కార్తీక మహా దీపోత్సవం ప్రధాన ఘట్టంగా డిసెంబర్‌ 3న జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు భరణి దీపం ఆలయంలో వెలిగించగా, సాయంత్రం 6 గంటలకు కొండపై మహా దీపం (అఖండ జ్యోతి) వెలిగిస్తారు. అనంతరం రాత్రి పంచమూర్తులను బంగారు వృషభ వాహనంపై ఊరేగిస్తారు.

దీపోత్సవ నేపథ్యంలో కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 3న జరిగే మహా దీపోత్సవానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణ వంటి పలు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లపై వివరాల నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం, డీజీపీ, జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. నవంబర్‌ 24 లోపు ఈ నివేదికను సమర్పించాలని తెలిపింది. గిరి ప్రదక్షిణ సందర్భంగా తొక్కిసలాట, అవాంఛనీయ ఘటనలు లేకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యల వివరాలు కూడా నివేదికలో ఉండాలని స్పష్టం చేసింది. గతంలో మహా దీపోత్సవం రోజున ఇతర రాష్ట్రాల భక్తులు రావొద్దని కలెక్టర్‌ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

కార్తీక ఉత్సవాలు దుర్గమ్మ ఉత్సవంతో ప్రారంభమై, వృషభ వాహన సేవతో ముగుస్తాయి. ఈ నెల 21న దుర్గమ్మ ఉత్సవంతో ఉత్సవాలు ప్రారంభమై, డిసెంబర్‌ 7న రాత్రి చండికేశ్వరస్వామి వెండి వృషభ వాహన సేవతో ముగుస్తాయి. ఈ మధ్యకాలంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి తిరువణ్ణామలైకు అధిక సంఖ్యలో భక్తులు చేరుతున్నారు. ఫలితంగా స్వామి దర్శనానికి 8–10 గంటల వరకు సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ముఖ్యంగా కార్తీకమాసంలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని పేర్కొన్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana