D Spiritual: Nov 17: ప్రతి రోజు ఉదయం హిందూ సంప్రదాయాల ప్రకారం ఇల్లు శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని విశ్వాసం. పట్టణాల్లో స్థలం తక్కువగా ఉన్నా కూడా ఇంటి ముందు చిన్న ముగ్గు వేసే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ అమావాస్య రోజున మాత్రం ఇంటి ముందు ముగ్గు వేయరాదని పెద్దలు చెబుతారు. ఇందుకు వెనుక ఉన్న కారణం పురాణాలు చెబుతున్న విషయం చాలా ముఖ్యమైనది.

పురాణాల ప్రకారం, అమావాస్య రోజున పితృదేవతలు మన ఇంటికి విచ్చేస్తారని నమ్మకం. ఆ రోజు వారు ఇంట్లోకి ప్రవేశించడానికి శుభ్రత అవసరం కాబట్టి ఇల్లు మొత్తం శుభ్రం చేయడం మంచిదే. అయితే ఇంటి ముందు ముగ్గు వేయడం మాత్రం చేయకూడదు. ఎందుకంటే ముగ్గు వేయబడినప్పుడు పితృదేవతలు ఇంటి లోపలికి ప్రవేశించరని, వారి మార్గం అడ్డుకుపోతుందని భావిస్తారు. అందుకే అమావాస్య రోజు ఇంటి ముందు కేవలం నీళ్లు మాత్రమే చల్లాలి కానీ ముగ్గు మాత్రం వేయరాదు.

పితృదేవతలు ఇంట్లోకి విచ్చేసి మన కుటుంబానికి ఆశీర్వాదాలు అందిస్తారని పురాణాలు చెబుతాయి. అమావాస్య రోజున వారు ప్రత్యేకంగా పూజలు, తర్పణాలు స్వీకరించడానికి వస్తారని భావిస్తారు. ముగ్గు వేయకపోవడం వల్ల వారు ఇంటిలోకి సులభంగా ప్రవేశించి మనసారా దీవిస్తారని విశ్వాసం. పితృదేవతలకు అమావాస్య ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో, ఆ రోజు ప్రత్యేక పూజలు, శ్రద్ధా కార్యక్రమాలు నిర్వహించడం పరంపరగా కొనసాగుతోంది. పితృదేవతల రాకకు అడ్డంకి కలగకుండా ఉండడానికి అమావాస్య రోజున ముగ్గు వేయకూడదని పండితులు సూచిస్తారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana