DET:NOV 15:
నూఱు సామి క్లైమాక్స్‌కు రెడీ!
విజయ్ ఆంటోనీ అభిమానులకు శుభవార్త.ఆయన నటిస్తున్న తాజా చిత్రం నూఱు సామి షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది.హీరో విజయ్ ఆంటోనీ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు.ఈ సినిమా చివరి షెడ్యూల్‌లో ఉన్నట్లు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోందని అర్థమవుతోంది.

బిచ్చగాడు కాంబో మళ్లీ:

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శశి దర్శకత్వం వహిస్తున్నారు.విజయ్ ఆంటోనీ,శశి కాంబినేషన్లో ఇది మూడవ సినిమా. ఇంతకు ముందు వీళ్లిద్దరూ కలిసి చేసిన బిచ్చగాడు ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.మళ్లీ ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ కలవడంతో ‘నూఱు సామి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కొత్త కథాంశంతో వస్తున్న సినిమా:

నూఱు సామి అనేది బిచ్చగాడు సినిమాలోని ఒక పాట నుంచి తీసుకున్న టైటిల్.అయితే,ఇది బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ మాత్రం కాదని దర్శకుడు శశి స్పష్టం చేశారు.ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు ఉంటారు.ఒకరు విజయ్ ఆంటోనీ కాగా,మరొకరు ఆయన మేనల్లుడు అజయ్ ధిషన్.ఇందులో లిజోమోల్ జోస్,స్వాసిక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సెట్స్ నుంచి అప్‌డేట్:

ఇటీవల విజయ్ ఆంటోనీ తన ట్విట్టర్ అకౌంట్‌లో సినిమా సెట్స్ నుంచి ఒక ఫోటోను షేర్ చేశారు. పచ్చని చెరుకుతోటలో కూర్చుని ఉన్న ఆ ఫోటో కింద,#NooruSaami Final Schedule అని రాశారు.దీనిని బట్టి,సినిమా కీలకమైన,చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసుకునే పనిలో ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం 2026 మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.