
DET:NOV 15:
నకిలీ ఖాతాను బయటపెట్టిన గుల్షన్ దేవయ్య:
నటి గిరిజా ఓక్ ఇటీవల ఇంటర్నెట్లో బ్లూ చీర అమ్మాయిగా బాగా వైరల్ అయ్యారు.ఆమెకు రాత్రికి రాత్రే భారీ పాపులారిటీ రావడంతో,దీనిని అడ్డం పెట్టుకుని కొంతమంది ఆకతాయిలు ఆమె పేరుతో నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు.ఈ నకిలీ ఖాతాలలో ఒకదానిని ఆమె సహనటుడు గుల్షన్ దేవయ్య సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు.
క్రష్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటున్న కేటుగాడు:
గిరిజా ఓక్‌పై ఇంటర్నెట్లో క్రష్ ఫేజ్ నడుస్తున్న సమయంలో ఆమె ఫొటో ఉపయోగించి ఒక నకిలీ ట్విట్టర్ ఖాతా తయారైంది.ఈ నకిలీ అకౌంట్ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ గుల్షన్ దేవయ్య,ఈ నకిలీ వ్యక్తి గిరిజా ఓక్ క్రష్ ఫేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు.మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో,ఆమె ఇక్కడ ఉన్నారు,అని ట్యాగ్ చేస్తూ అసలు అకౌంట్‌ను నెటిజన్లకు చూపించారు.
గుల్షన్ సంస్కారంపై గిరిజా ప్రశంస:
మరోవైపు గుల్షన్ దేవయ్య సున్నితత్వం గురించి గిరిజా ఓక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.తమ రాబోయే సిరీస్ థెరపీ షెరాపీలో ఒక ఇంటిమేట్ సీన్ షూట్ చేసేటప్పుడు గుల్షన్ చూపిన జాగ్రత్తను ఆమె ప్రస్తావించారు.ఆ సన్నివేశం కోసం,గుల్షన్ తన వ్యాన్ నుంచి మూడు నాలుగు రకాల దిండులను తెచ్చి,తనకు ఏది సౌకర్యంగా ఉంటుందో ఎంచుకోమన్నారని చెప్పారు.
మీరు ఓకేనా? అని 17 సార్లు అడిగారు:
ఆ ఇంటిమేట్ సీన్ షూట్ సమయంలో,గుల్షన్ తనను కనీసం 16 లేదా 17 సార్లు మీరు ఓకేనా? అని అడిగారని గిరిజా తెలిపారు.మీరు ఈ సీన్‌ను తీసేయాలని అనుకుంటే,నాకు పూర్తిగా అభ్యంతరం లేదు అని కూడా గుల్షన్ అన్నారని,ఆయన చూపిన ఆ శ్రద్ధ మరియు గౌరవం తనను ఎంతగానో కదిలించిందని ఆమె చెప్పారు.గుల్షన్ వల్లనే ఆ సన్నివేశంలో తాను పూర్తిగా తేలికపడ్డానని,ఆయన అలాంటి మంచి వ్యక్తి కావడం అద్భుతమని గిరిజా ఓక్ ప్రశంసించారు.
