DSports 15 Nov:ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఆటగాళ్ల ట్రేడ్ విండోలో ఊహించని భారీ మార్పు జరిగింది. ఎన్నో రోజులుగా చర్చలు జరిగిన సంజు శాంసన్ మరియు రవీంద్ర జడేజా ట్రేడ్ డీల్ ఎట్టకేలకు అధికారికంగా పూర్తయినట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ మార్పిడి ఐపీఎల్ ట్రేడింగ్ చరిత్రలోనే అతిపెద్ద డీల్‌గా నిలిచింది.

ఈ ట్రేడ్ ఒప్పందం ప్రకారం:

రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నుంచి రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులోకి మారారు.

సంజు శాంసన్రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్సీని వదిలి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి ట్రేడ్ అయ్యారు.

ట్రేడ్ వివరాలు:

సంజు శాంసన్: తన ప్రస్తుత ఫీజు ₹18 కోట్లతో సీఎస్‌కేలో చేరారు.

రవీంద్ర జడేజా: సీఎస్‌కేలో అతని ఫీజు ₹18 కోట్లుగా ఉన్నప్పటికీ, ట్రేడ్ ఒప్పందం ప్రకారం రాజస్థాన్ రాయల్స్ అతనికి ₹14 కోట్లు చెల్లించనుంది.

ఈ స్వాప్ డీల్‌లో భాగంగా, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌లోకి ₹2.4 కోట్లకు ట్రేడ్ అయ్యారు. ఈ మార్పులకు ప్రధానంగా రెండు అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి: మహేంద్ర సింగ్ ధోని కెరీర్ చివరి దశలో ఉండటం వల్ల భవిష్యత్తు నాయకత్వం కోసం సీఎస్‌కే సంజు శాంసన్‌ను తీసుకుంది. అలాగే, ఒకప్పటి రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ అయిన జడేజాను జట్టులోకి తీసుకోవడం ద్వారా రాయల్స్ తమ ఆల్‌రౌండర్ బలాన్ని పెంచుకోవాలని భావించింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana