
DNews: Nov15: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మీద జరుగుతున్న క్రైమ్స్ అగైన్‌స్ట్ హ్యూమానిటీ కేసులో తీర్పు నవంబర్ 17, 2025న వెలువడనుంది. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ICT) చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం, “హసీనా మరియు ఆమె ఇద్దరు ముఖ్య సహాయకులకు ఎక్సాంపులరీ వర్డిక్ట్ (మరణశిక్ష) ఆశిస్తున్నాము” అని స్పష్టం చేశారు. ఈ కేసు 2024 జూలైలో జరిగిన విద్యార్థుల ఆందోళనలపై పోలీసు దాడులు, 1,400 మంది మరణాలకు హసీనా మాస్టర్ మైండ్‌గా ఉన్నారని ఆరోపణ. హసీనా ఇప్పుడు భారతదేశంలో ఆశ్రయం పొంది, కోర్టు ఆర్డర్‌లను ఉల్లంఘించి ట్రయల్‌లో హాజరు కాలేదు అని తెలిపాడు .
హసీనా 1,400 మరణశిక్షలు అర్హురాలు అని, ఆయన అన్నారు. “అది మానవీయంగా సాధ్యం కాదు కాబట్టి, మేము కనీసం ఒకదాన్ని డిమాండ్ చేస్తున్నాము,” అని ఆయన కోర్టును కోరారు.
