
DET:NOV 15:
రాజ్కుమార్-పత్రలేఖ దంపతులకు ఆడపిల్ల పుట్టింది!
బాలీవుడ్ ప్రముఖ జంట రాజ్కుమార్ రావు మరియు పత్రలేఖ మొదటిసారి తల్లిదండ్రులయ్యారు.వీరికి ఒక ముద్దులొలికే ఆడపిల్ల జన్మించింది.తమ కుమార్తె రాకను వాళ్ళు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.ఈ శుభవార్త వాళ్ల పెళ్లిరోజు అయిన నవంబర్ 15నే రావడంతో ఆ దంపతుల ఆనందం రెట్టింపైంది.మేము ఎంతో సంతోషంగా ఉన్నాం.దేవుడు మాకు ఆడపిల్లను ఇచ్చాడు.దేవుడు మా నాలుగవ పెళ్లిరోజు సందర్భంగా ఇచ్చిన గొప్ప వరం ఇది అని రాజ్కుమార్ రావు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
వరుణ్ ధావన్ వెల్‌కమ్ టు ది క్లబ్ అంటూ శుభాకాంక్షలు:
ఈ సంతోషకరమైన వార్త తెలుసుకున్న వెంటనే,సినీ పరిశ్రమలోని స్నేహితులు మరియు ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.ముఖ్యంగా,ఇటీవలే కూతురికి తండ్రైన నటుడు వరుణ్ ధావన్ రాజ్కుమార్ రావును గర్ల్ డాడ్ క్లబ్‌లోకి ఆహ్వానించారు.వరుణ్ తన కామెంట్‌లో,వెల్‌కమ్ టు ది క్లబ్,గైస్ అని రాశారు.అంటే,ఆడపిల్ల తండ్రులైన వారి గుంపులోకి రాజ్కుమార్‌ను ఆహ్వానించినట్లు.
సెలబ్రిటీల ప్రేమ మరియు శుభాకాంక్షలు:
వరుణ్ ధావన్‌తో పాటు,కృతి సనన్,సోనమ్ కపూర్,నేహా ధూపియా,విక్కీ కౌశల్,అలీ ఫజల్ వంటి అనేకమంది సెలబ్రిటీలు ఈ కొత్త తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.నటి నిమ్రత్ కౌర్ కూడా మీ ఇద్దరికీ చాలా సంతోషంగా ఉంది.అభినందనలు! అని కామెంట్ చేశారు.ఈ చిన్నారి రాకతో వారి జీవితం మరింత అందంగా మారాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
