DNews:13 NOV:హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. శుక్రవారం (నవంబర్ 14) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఎన్నికలు గెలిచినా… ఓడినా ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం కొనసాగిస్తాం’’ అని స్పష్టం చేశారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ చివరి వరకు పోరాడారని, బాగా కృషి చేశారని ఆయన ప్రశంసించారు.

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందనే సంకేతాలు అన్నీ ఉన్నప్పటికీ చివరి మూడు రోజుల్లో జరిగిన పరిణామాలు ఫలితాలపై ప్రభావం చూపాయని కేటీఆర్ అన్నారు.కాంగ్రెస్ దొంగ ఓట్లతో, అక్రమాలతో విజయం సాధించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. “ఈ ఉప ఎన్నికతో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్‌నే అని ప్రజలు మరోసారి అర్థం చేసుకున్నారు’’ అని చెప్పారు.

దివంగత నేత మాగంటి గోపినాథ్ మరణంతో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది.కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్పై 24,658 ఓట్ల భారీ మెజారిటీతో గ్రాండ్ విక్టరీ సాధించారు.ఈ మెజార్టీతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక ఓట్ల తేడాతో గెలిచిన అభ్యర్థిగా నవీన్ యాదవ్ రికార్డు సృష్టించారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana