
DSports 14 Nov:దోహా వేదికగా జరిగిన ఐబీఎస్‌ఎఫ్ (IBSF) వరల్డ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ (15-రెడ్)లో భారత క్యూయిస్ట్ అనుపమ రామచంద్రన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన అనుపమ, మహిళల ప్రపంచ స్నూకర్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
