
DET:NOV 13:
ముఖ్యంగా ఆకట్టుకుంటున్న సినిమాలు:
పవన్ కళ్యాణ్ ఓజీ:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించింది.ఈ సినిమా గురించి థియేటర్లలో ఉన్నప్పుడు ఎంత చర్చ జరిగిందో,ఇప్పుడు ఓటీటీలో కూడా అంతే హంగామా నడుస్తోంది. యాక్షన్ ప్రియులకు ఇది మంచి ఛాయిస్.
తేజ సజ్జా మిరాయ్:
తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ జియో సినిమాస్ లో బాగా ట్రెండ్ అవుతోంది.ఈ సూపర్ హీరో చిత్రం కూడా ఓటీటీలో ఎక్కువ మంది చూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది.
తెలుసు కదా ఓటీటీ ఎంట్రీ:
సిద్ధు జొన్నలగడ్డ,రాశీ ఖన్నా,శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుసు కదా సినిమా ఈ వారం ఓటీటీలోకి వచ్చింది.ఈ రొమాంటిక్ డ్రామా సినిమా నవంబర్ 14 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
నడికర్ (మలయాళం):
మలయాళంలో మంచి విజయం సాధించిన ‘నడికర్’ చిత్రం కూడా లయన్స్ గేట్ ప్లే లో అందుబాటులోకి వచ్చింది. ఇతర భాషల మంచి కంటెంట్‌ని ఇష్టపడేవారు ఈ సినిమాను చూడవచ్చు.
భద్రకాళి (తమిళం):
జియో హాట్‌స్టార్ లో తమిళ సినిమా ‘భద్రకాళి’ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమా కూడా సౌత్ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది.
