D Spiritual: Nov 12: ఉద్యోగంలో పదోన్నతి పొందడం ఎలా?
సాధారణంగా అందరూ ఏదో ఒక వృత్తి చేస్తుంటారు. వృత్తి అంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడం. ఆయా రంగాల్లో తమ జీవితాలను జీతాల కోసం పనిచేస్తుంటారు. అయితే చాలామంది ఏండ్ల తరబడి ఉద్యోగంలో వృద్ధి లేకుండా ఉంటారు. వారిముందు వచ్చిన చిన్నవారు వారిని దాటిపోతుంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగంలో ప్రమోషన్‌ (పదోన్నతి) పొందాలంటే కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది.

శనీశ్వరుడి పూజ ద్వారా స్థిరత్వం
ఉద్యోగి తన ఉద్యోగంలో స్థిరత్వం కోసం, అభద్రతా భావం తొలగించుకోవాలంటే తప్పకుండా శనీశ్వరుడిని పూజించాలి.
“ఓం చర స్థిర స్వభవాయ నమః” అనే మంత్రాన్ని శనివారం రోజున వీలయినన్ని సార్లు జపించడం ఉత్తమం.
సంధ్యా సమయంలో రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయాలి.

హనుమంతుడి పూజ ద్వారా అనుగ్రహం
ఇది మాత్రమే కాకుండా, హనుమంతుని విగ్రహం లేదా చిత్రపటం ముందు నువ్వుల నూనె, సింధూరం కలిపి లేపనం వేయాలి. ఈ విధంగా హనుమంతుడిని పూజించడం వలన శనిదోషం తగ్గి, ఉద్యోగ స్థిరత్వం పెరుగుతుంది.

కాలభైరవుడి మరియు శివుడి పూజ
రెండో పరిహారం ఏమిటంటే – కాలభైరవ ఆలయంలో దీపం వెలిగించడం. ఇలా చేయడం ద్వారా ఉద్యోగ స్థిరత్వం వస్తుంది.
శివాలయంలో దీపం పెట్టాలనుకుంటే, ఆవనూనెతో దీపం వెలిగించాలి.
ఇంట్లో కూడా శనివారం రోజున ఒక ఇనుప ప్రమిదలో కొబ్బరినూనెతో దీపం వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.

ప్రదోషకాలంలో చేయవలసిన ప్రత్యేక పూజలు
శనివారం రోజున పచ్చకర్పూరం, కుంకుమ కలిపి ముఖానికి తిలకం ధరించడం శుభప్రదం.
అలాగే ప్రదోషకాలంలో రావిచెట్టు, వేపచెట్టు మొదట్లో ఉన్న పుట్టలలో పాలు, నీళ్ళు కలిపి పోయడం ద్వారా ఉద్యోగంలో సంతృప్తికరమైన స్థానానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

సోమవారం శివపూజ – శ్రేష్ఠమైన ఫలితం
సోమవారం రోజున పరమేశ్వరుడికి పసుపురంగు పూలమాల వేసి, గరికె పూలతో పూజ చేయాలి.
పూజ అనంతరం శనగలు పెట్టి ప్రసాదంగా పరమేశ్వరుడికి నివేదించాలి.
ఇలా చేసినవారికి పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఉద్యోగంలో సరైన స్థితి, ప్రగతి లభిస్తుంది.

మంత్రజపం – పదోన్నతికి దారి
పూజతో పాటు “ఓం వృషభ వాహనాయ నమః” అనే మంత్రాన్ని వీలయినన్ని సార్లు జపించాలి. ఈ మంత్రం శివుని వృషభవాహన స్వరూపాన్ని స్మరించడమే కాకుండా, భక్తుడికి స్థిరత్వం, ధైర్యం, మరియు ప్రమోషన్ సాధనలో సహకరిస్తుంది.

భక్తి, శ్రద్ధతో చేసే పూజే ఫలితదాయకం
ఈ పరిహారాలు ఎంత ముఖ్యమైనవైనా, భక్తి మరియు శ్రద్ధతో పూజ చేయడం అత్యవసరం.
అదేవిధంగా, ఉద్యోగంలో కూడా భక్తితో, నిబద్ధతతో పనిచేయడం మరిచిపోకూడదు.
ఇలా దేవతల ఆశీర్వాదం, మన కృషి కలిస్తే తప్పకుండా అనతికాలంలో పదోన్నతి లభిస్తుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana