D Spiritual: Nov 11: భారతదేశం ప్రాచీన ఆలయాలు, కట్టడాలు అధికంగా ఉన్న దేశం, ఇక్కడి మతపరమైన నిర్మాణాలు దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అనేక పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరినా లేదా నిర్లక్ష్యం వల్ల భూస్థాపితమైనా, కొన్ని మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి బీహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లా, కౌరా ప్రాంతంలో ఉన్న ముండేశ్వరీ ఆలయం.

ఈ ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా చరిత్రకారుల అంచనా. దీనిని మూడు లేదా నాలుగు శతాబ్దాల కాలంలో నిర్మించారని చెబుతారు. మొదట్లో విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉండగా, ఏడవ శతాబ్దంలో శివుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ ఆలయం సముద్రమట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉన్నది మరియు ఆలయం చుట్టు పక్కల ప్రాంతాలలో 625 సంవత్సరం నాటి శాసనాలు బయటపడ్డాయి. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయంగా కూడా ఈ ముండేశ్వరీ ఆలయాన్ని పరిగణిస్తారు. ఇది కైమూర్ జిల్లాలోని ముండేశ్వరీ అనే పర్వతం మీద ఉంది. ఇక్కడ అమ్మవారు వరాహి మాతగా కనిపిస్తారు మరియు ఆమె వాహనం మహిషి. ఈ దేవాలయం ఒక అష్టభుజి దేవాలయం, దీని ప్రధాన ఆలయ ద్వారం దక్షిణ దిశలో ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో, ఎద్దు పైన స్వారీ చేసే మహిషాసురమర్దిని రూపంలో ఉంటారు. ఇక్కడ శివుడు కూడా నాలుగు ముఖాలతో కొలువై ఉన్నారు. ఈ దుర్గామాత ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిదని భక్తులు విశ్వసిస్తారు, ఇక్కడ మహిమ గల శివుడికి ఇంకా ఇతర పూజలు కూడా అధికంగా జరుగుతుంటాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana