
D Spiritual: Nov 11: సాధారణంగా మనం ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవాలి అంటే ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తాము. అలాంటి వాటిలో శంఖం ఒకటి. చాలామందికి ఇంట్లో శంఖం పెట్టుకోవచ్చా లేదా అనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలు కలుగుతూ ఉంటాయి.
అయితే మన హిందూ పురాణాల ప్రకారం శంఖం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. కనుక శంఖం ఇంట్లో పెట్టుకోవడం వల్ల అన్ని శుభఫలితాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే శంఖం ఇంట్లో ఉన్నప్పుడు ఆ శంఖం ఉంచే ప్రదేశంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పూజ చేసే విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
మనం శంఖం కొనుగోలు చేసేటప్పుడు ఒక శంఖం మాత్రమే కొనరాదు; రెండు శంఖాలు కొనాలి. అందులో ఒకటి నీటి శంఖం, మరొకటి ఊదడం కోసం ఉపయోగించే శంఖం. పురాణాల ప్రకారం శంఖాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కనుక ఇంట్లో శంఖం ఉండటం వల్ల ఆ ఇంటిలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్మకం ఉంది.
శంఖం ఇంట్లో పెట్టేటప్పుడు పూజా గదిలో విష్ణు పాదాల చెంత ఉంచాలి. ఈ నీటి శంఖంలో ఎల్లప్పుడూ నీరు పోసి ఉంచడం శ్రేయస్కరం. అలాగే శంఖాన్ని పూజ చేసే ముందు ప్రతిరోజూ తప్పనిసరిగా శుభ్రం చేసి పూజ చేయాలి.
మనము శంఖాన్ని ఉపయోగించకపోతే, దానిని నూతన వస్త్రంలో లేదా ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి డబ్బు నిల్వ చేసే చోట ఉంచడం మంచిది. కానీ పొరపాటున కూడా రెండు శంఖాలను ఒకే చోట ఉంచకూడదు.
శంఖాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కనుక ఇంట్లో విష్ణు ఫోటో దగ్గర ఈ శంఖం ఉండడం ఎంతో శుభకరం. ఏ ఇంట్లో అయితే శంఖం పూజించబడుతుందో, ఆ ఇంటిలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అంతేకాదు, ఆ ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది అని పండితులు చెబుతున్నారు.
