
DET:NOV 08:
దిగ్గజ నటుడు హరీష్ రాయ్ మృతి:
ప్రముఖ కన్నడ నటుడు మరియు KGF చిత్రంలో ‘చాచా’ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించిన హరీష్ రాయ్ గారు క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు.ఆయన వయస్సు 55 సంవత్సరాలు.ఓం,హలో యమ వంటి ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ముఖ్యంగా,KGF 1 మరియు 2 భాగాలలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆయన మృతితో సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అంతిమ నివాళులు అర్పించిన రాకీ భాయ్ యశ్:
హరీష్ రాయ్‌తో ‘KGF’ సిరీస్‌లో కలిసి నటించిన కన్నడ స్టార్ హీరో యశ్ తన సహనటుడికి కన్నీటితో వీడ్కోలు పలికారు. బెంగళూరులో జరిగిన హరీష్ రాయ్ అంత్యక్రియలకు యశ్ హాజరయ్యారు.తెల్లటి షర్ట్ ధరించి వచ్చిన యశ్.. మృతుడి పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సమయంలో,హరీష్ రాయ్ కుమారుడిని దగ్గరకు తీసుకుని ఓదార్చుతూ యశ్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు.ఈ దృశ్యం చూసిన అభిమానులు కూడా కంటతడి పెట్టారు.
కష్టాల్లో ఆదుకున్న యశ్:
హరీష్ రాయ్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో తన అనారోగ్యం గురించి,ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడారు.ఆ సమయంలో యశ్ తనకు సహాయం చేశారని,అయితే తన అనారోగ్యం గురించి మళ్ళీ ఆయనను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని తెలిపారు.తాను ఎప్పుడైనా ఫోన్ చేస్తే యశ్ తప్పకుండా తన కోసం ఉంటారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన మరణించిన తరువాత యశ్ వచ్చి నివాళి అర్పించడంతో,యశ్ చూపిన అభిమానం,ఆప్యాయత మరోసారి అందరికీ తెలిసాయి. హరీష్ రాయ్ కుటుంబానికి ధైర్యం చెప్పి,యశ్ తన మంచి మనసును చాటుకున్నారు.
డిప్యూటీ సీఎం సంతాపం:
కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు కూడా హరీష్ రాయ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.కన్నడ సినీ పరిశ్రమ ఓ గొప్ప నటుడిని కోల్పోయిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఓం సహా KGF సినిమాలలో ఆయన నటన అద్భుతమని కొనియాడారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ,ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.
