
DNews:06 NOV: “రోడ్డు మాది… వ్యాపారం కూడా మాదే!” అన్నట్టుగా వ్యవహరిస్తున్న నిజామాబాద్ చిరు వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాలపై గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, ఆక్రమణలను తొలగించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రం, హైమదీబజార్. హైమదీబజార్లో ఉన్న మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లతో పాటు కూరగాయల విక్రయాలు పూర్తిగా రోడ్డుపైకి విస్తరించడం.ప్రభావం నిత్యం ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మార్కెట్లో వాహనం వెళ్లాలంటే ‘యుద్ధం’ చేయాల్సి వచ్చేది.
చర్యలు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐ పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు.దుకాణాల ఎదుట ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించి, రోడ్డును క్లియర్ చేశారు.
ట్రాఫిక్ పోలీసులు చిరు వ్యాపారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.”ఇకమీదట ఎవరైనా మళ్లీ రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించినట్లయితే, వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.”ఈ స్పెషల్ డ్రైవ్లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై ముజహీద్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
