DNews: 6Nov: తిర్హుత్ ప్రాంతంలో ఈ 2 పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు మిగిలిన పార్టీల పోటీ తక్కువే..
బిహార్ ఉత్తరాన, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న తిర్హుత్ ప్రాంతంలోని చాలా నియోజకవర్గాల్లో భాజపా, ఆర్జేడీ మధ్యే హోరాహోరీ పోరు సాగుతోంది. ఎక్కువ సీట్లలో ఈ రెండు ప్రధాన పార్టీలే బరిలో నిలుస్తాయి. మిగిలిన పార్టీలు పెద్దగా పోటీలో ఉండవు. 6 : 6 20 49 నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఈస్ట్ చంపారణ్ లో అత్యధికంగా 12 ఉన్నాయి. ముజఫరుర్లో 11, వెస్ట్ చంపారణ్ లో 9, వైశాలీ, సీతామడీలలో 8 చొప్పున, శివార్లో ఒక సీటున్నాయి.

గత ఎన్నికల్లో..
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో 33 సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుంది. అందులో 25 సీట్లు బాజపాకే దక్కాయి. మహాగర్ బందన్ 18 సీట్లలోనే విజయం సాధించింది. అందులో 18 ఆర్థడీకే దక్కాయి.
2015లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయగా.. మహాగర్బంధన్ 26 చోట్ల గెలి చింది. ఎన్డీయే 20 చోట్ల నెగ్గింది.
ఈసారీ బాజపా, ఆర్జేడీలే అధిక సీట్లలో ఇక్కడ తలపడుతున్నాయి.

కీలక నియోజకవర్గాలు..
తిరుత్ ప్రాంతంలో తేజస్వీ పోటీ చేసే రాష్ట్రపుర్తో పాటు మహువా, నౌతన్, బేతియా. శివార్ వంటి కీలక నియోజకవర్గాలున్నాయి. లాలూ ఇద్దరు కుమారులు తేజస్వీ, తేజ్ ప్రతాప్ ఈ ప్రాంతంలోనే పోటీలో ఉన్నారు. అయితే ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. వివాదాస్పద నేత షాబుద్దీన్ కుమారుడు ఒసామా షాబుద్దీన్ కూడా ఇక్కడే బరిలో ఉన్నారు. భాజపా కీలక నేత సామ్రాట్ చౌదరీ ఇక్కడే పోటీ చేస్తున్నారు.
ఈస్ట్, వెస్ట్ చంపారణ్ జిల్లాల్లో ఎన్డీయే బలంగా ఉంది. అందు లోనూ భాజపాకు మద్దతు అది కంగా ఉంటుంది. ముజఫరు ర్లో ఓబీసీ అనుబంధ పార్టీలు బలంగా ఉంటాయి. ఆర్జేడీకి మొగ్గు ఉంటుంది.

యువతలో తీవ్ర అసంతృప్తి
నేపాల్ సరిహద్దుల్లో ఉన్న సీతామడీ జిల్లాలోని యువతలో తీవ్ర అసంతృప్తి ఉంది. చాలా మంది అక్కడి నుంచి పొరుగునే ఉన్న నేపాల్ వెళ్లి చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సీతామడీలో ఎక్కువ మంది యువ ఓటర్లున్నారు. వారిలో ఎక్కువ మంది ప్రభుత్వం మారాలనే కోరుకుంటున్నారు. అయితే ఎన్నికల తర్వాతా బీహార్లో పెద్దగా మార్పులు వస్తాయనే ఆశ వారిలో లేదు. వలసలే బిహార్కు అతి పెద్ద సమస్యని, దానిని అరికట్టడానికి అవకాశాలు తక్కువని ఈ ప్రాంత యువత అభిప్రాయపడుతున్నారు.
మహిళల్లో మాత్రం ఎన్డీయే పట్ల ఆదరణ కనిపిస్తోంది. వారి ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేయడం ప్రభావితం చూపుతుందని అంటున్నారు. వారిలో ఎక్కువ మంది నీతీశీవైపే ఉన్నారని చెబుతు న్నారు.
ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా ఈ ప్రాంతంలో కుల సమీక రణాలూ ప్రభావితం చేస్తుంటాయి. యువత కూడా మార్పు కోరుతు న్నారుగానీ అది ఎంతవరకు ఫలితమిస్తుందో చూడాలి.
నీతీశ్ వయసుపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆయన వైదొలగి యువకులకు అవకాశం ఇవ్వాలని కొంత మంది కోరుకుంటున్నారు. కుల సమీకరణాలవల్ల ఎన్నికల ఫలితాలు ప్రభావితం అవుతుండటంపట్ల యువత అసంతృప్తితో ఉన్నారు.

అభ్యర్థులపై వ్యతిరేకత
ఈసారి రెండు కూటములు నిలిపిన అభ్యర్థులపై తిరు త్లో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా యువ ఓటర్లు అభ్య ర్థులను అంగీకరించడం లేదు. కొంత మంది అభ్యర్ధులు ఒక్కసారి కూడా తమ ప్రాంతాలకు రాలేదని పలువురు తెలిపారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana