D Spiritual: Nov 6: కపిల తీర్థం అన్నాభిషేకం: పరిచయం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్లో కార్తిక పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. విశేషించి కొన్ని దేవాలయాల్లో జ్వాలా తోరణం, దీపోత్సవం, స్తంభదీపం వంటి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టెంపుల్ సిటీగా పేరొందిన తిరుపతి కపిల తీర్థంలో కార్తిక పౌర్ణమి రోజు పరమ శివునికి నిర్వహించే ఒక ప్రత్యేక ఉత్సవం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆలయాలకు కార్తిక పౌర్ణమి శోభ ఏడాది మొత్తం శివ భక్తులు ఎదురు చూసే పర్వదినం కార్తిక పౌర్ణమి మరో రెండు రోజుల్లో రానుంది. ఇటు శైవులకు, అటు వైష్ణవులకు కూడా కార్తిక పౌర్ణమి అతి పెద్ద పర్వదినం. ఈ రోజు శివాలయాల్లో, వైష్ణవాలయాల్లో తెలిసో తెలియకో దీపారాధన చేయడం వలన కలిగే పుణ్యఫలం అనంతమని పురాణాలు చెబుతున్నాయి. నవంబర్ 5, బుధవారం కార్తిక శుద్ధ పౌర్ణమి రోజును కార్తిక పౌర్ణమి పర్వదినంగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. దాదాపుగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆలయాలన్నీ కార్తిక శోభతో కళకళలాడుతాయి. ఈ సందర్భంగా కపిల తీర్థంలో శివునికి ఒక ప్రత్యేక సేవ నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

కపిల తీర్థం ఎక్కడుంది? కపిల తీర్థం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో వెలసిన ప్రసిద్ధ శైవక్షేత్రం, పుణ్యతీర్థం. ఈ ఆలయంలోని శివలింగం కపిల ముని ప్రతిష్టించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ శివుడు కపిలేశ్వరుడుగా పిలువబడుతూ పూజలందుకుంటున్నాడు.

మనోహరం కపిలతీర్థం దర్శనం తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనకు కపిలతీర్థం దర్శనమిస్తుంది. ఇక్కడి సుందరమైన జలపాతం చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు, ప్రశాంత వాతావరణంలో పరమశివుని దర్శనం మానసిక ప్రశాంతత నిస్తుంది. కొండల మీద నుంచి దాదాపు 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకి ప్రవహించే ఆకాశగంగను కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు.

మోక్షదాయకం – కపిల తీర్థ స్నానం కపిల తీర్థంలో కార్తిక మాసంలో స్నానం ఆచరించి పరమ శివుని దర్శించి, ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. ఇక కార్తిక పౌర్ణమి సందర్భంగా కపిల తీర్థంలో జరిగే అన్నాభిషేకం కనులారా వీక్షించిన వారి జన్మ ధన్యమయినట్లే! కపిల తీర్థంలో జరిగే ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని చూడటానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. ఈ అన్నాభిషేకం ఎలా చేస్తారు? తెలుసుకుందాం.

అన్నాభిషేకం తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5, బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న కపిల తీర్థంలో జరిగే ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహిస్తారు.

సుప్రభాత సేవ ఈ సందర్భంగా ఉదయం 2 గంట‌ల‌కు సుప్ర‌భాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు సాధారణ అభిషేకం, అలంకారం, అర్చ‌న నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నాభిషేకం, దీపారాధన కార్యక్రమాలు జరుగుతాయి. ఏకాంతంగా జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు.

అన్న లింగ దర్శనం తర్వాత సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామికి అభిషేకించిన అన్నాన్ని ప్రసాదంగా పంచి పెడతారు.

అన్న లింగ దర్శనఫలం కపిల తీర్థంలో కార్తిక పౌర్ణమి రోజు జరిగే ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని కనులారా వీక్షించి కొంచెం అన్నాన్ని ప్రసాదంగా తీసుకుంటే ఎలాంటి రోగాలైన పోతాయని, సమస్త పాపాలు నశించిపోతాయని భక్తుల విశ్వాసం.

ముగింపు రానున్న కార్తిక పౌర్ణమి రోజు మనం కూడా కపిలేశ్వరస్వామి అన్నలింగాన్ని దర్శిద్దాం. ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. ఓం నమః శివాయ!

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana