D Spiritual: Nov 4: కార్తీకమాసం వచ్చిదంటే అంతటా శివోహం… శివనామస్మరణలతో మారుమ్రోగుతుంది. ఈ మాసంలో భక్తులు ఉపవాసం, శివాభిషేకం ఎంతో విశేషంగా ఆచరిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు అని శాస్త్రవచనం.

“శివో అభిషేక ప్రియః” అంటే “శివుడు అభిషేక ప్రియుడు” అనే అర్థం. దోసెడు నీటిని లింగంపై పోసినా సంతోషించి సకల సంపదలు, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఆయన కోటీశ్వరుడుకైనా, కూటికి లేనివాడికైనా సమానంగా వరాలు ఇస్తాడు.

కాసింత భస్మం (బూడిద), కాసింత నీళ్లు, మారేడు దళం చాలు ఆయన సేవకు. భోళాశంకరుడు కాబట్టి అభిషేకం చేస్తే చాలు, ఆనందంతో అనుగ్రహిస్తాడు. నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలంతో అభిషేకించినా ఆయన సుప్రసన్నుడవుతాడు. మన అభీష్టాలు నెరవేర్చుతాడు.

అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతాం. మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేకత ఉంది. కార్తీకమాసంలో భక్తులు ఈ పూజా ద్రవ్యాలతో శివుని అభిషేకించి స్వామివారి అనుగ్రహం పొందవచ్చు.

ద్రవ్యాలు – కలిగే ఫలితాలు

భస్మ జలం – మహా పాప హరణం
సుగంధోదకం – పుత్ర లాభం
పుష్పోదకం – భూలాభం
బిల్వ జలం – భోగ భాగ్యాలు
ఆవు పాలు – సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు – ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి – ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) – దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె – తేజోవృద్ధి
నువ్వుల నూనె – అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం – మహా ఐశ్వర్యం
సువర్ణ జలం – దరిద్ర నాశనం
అన్నాభిషేకం – సుఖ జీవనం
గంగోదకం – సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరి జలం – చక్రవర్తిత్వం
నేరేడు పండ్ల రసం – వైరాగ్య ప్రాప్తి
నవరత్న జలం – ధాన్య గృహ ప్రాప్తి
ద్రాక్ష రసం – సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం – సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం – శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం) – ద్రవ్య ప్రాప్తి
ధవళోదకమ్ – శివ సాన్నిధ్యం
మామిడి పండు రసం – దీర్ఘవ్యాధి నాశనం
పసుపు, కుంకుమ – మంగళప్రదం
విభూది – కోటి రెట్లు ఫలితం లభిస్తుంది

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana