
DET:NOV 04:
సద్గురు గారి ఆశ్చర్యం: యష్‌ని రావణుడిగా ఎందుకు ఎంచుకున్నారు?
నితీష్ తివారీ తీయబోతున్న భారీ చిత్రం రామాయణం గురించి ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది.ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా,యష్ రావణుడిగా నటిస్తున్నారు.ఈ నేపథ్యంలో,నిర్మాత నమిత్ మల్హోత్రాతో ఆధ్యాత్మిక గురువు సద్గురు చేసిన సంభాషణ వైరల్ అవుతోంది.రావణుడి పాత్ర కోసం కేజీఎఫ్ స్టార్ యష్‌ను ఎంచుకోవడంపై సద్గురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.యష్ చాలా అందమైన వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు.
రావణుడి పాత్ర గురించి సద్గురు అభిప్రాయం:
సినిమా కాస్టింగ్ గురించి మాట్లాడుతూ,సద్గురు తనదైన శైలిలో రావణుడి రూపం ఎలా ఉండాలనే దానిపై అభిప్రాయం పడ్డారు. విలన్‌కు ఎప్పుడూ మొండి ముక్కు,భారీ ఆకారం ఉండాలి.యష్ చాలా అందంగా ఉంటాడు అని సద్గురు నవ్వుతూ అన్నారు.యష్ రావణుడిగా ఎలా మారాడో నాకు తెలియదు.నాకు అతను బాగా తెలుసు” అని కూడా చెప్పారు.
నిర్మాత నమిత్ మల్హోత్రా వివరణ:
సద్గురు వ్యాఖ్యలకు నిర్మాత నమిత్ మల్హోత్రా స్పందిస్తూ,తాము ‘సూపర్‌స్టార్ స్థాయి’ ఉన్న నటుడిని తీసుకోవాలని చూశామని వివరించారు.యష్ చాలా ప్రతిభావంతుడు,దేశవ్యాప్తంగా అపారమైన అభిమానాన్ని కలిగి ఉన్నాడని చెప్పారు.రావణుడి పాత్రలోని అన్ని పార్శ్వాలను అతని గొప్ప జ్ఞానం,అహంకారం,కోరిక వంటి లక్షణాలన్నిటినీ చూపించాలనే ఉద్దేశంతోనే యష్‌ని ఎంచుకున్నట్లు నమిత్ తెలిపారు.రావణుడు కేవలం రాక్షసుడిగానే కాకుండా,వేదాల్లో గొప్ప పండితుడిగా కూడా ఉంటాడని, ఆ పాత్రకు ఉండే బహుముఖ కోణాలను యష్ పోషించగలడని ఆయన స్పష్టం చేశారు.
రణ్‌బీర్ కపూర్ ఎంపికపై కూడా చర్చ:
ఈ సంభాషణలో,రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్ర పోషించడంపై వస్తున్న విమర్శల గురించి కూడా చర్చ జరిగింది.గతంలో రణ్‌బీర్ నటించిన పాత్రల ఆధారంగా అతన్ని విమర్శించడం అన్యాయం అని సద్గురు అన్నారు.నటుడు ఒక పాత్ర పోషించాడు కాబట్టి అతన్ని విమర్శించడం సరికాదు.రేపు అతను మరో సినిమాలో రావణుడి పాత్ర కూడా చేయవచ్చు.అది ఒక వృత్తిపరమైన నటుడి పని అని సద్గురు రణ్‌బీర్‌కు మద్దతు పలికారు.అయితే,రాముడి పాత్ర పోషించే నటుడు రాముడి గుణాలను కొంతైనా అలవర్చుకోవాలని సూచించారు.
