
DET:NOV 04:
నటి రష్మిక కోరిక:
నేషనల్ క్రష్ అని పిలవబడే రష్మిక మందన్న ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉంది.ఆమె సోషల్ మీడియాలో తన అభిమానులతో మాట్లాడినప్పుడు,ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సరదాగా సమాధానం ఇచ్చింది.
ప్రభాస్‌తో నటించాలనే ఆసక్తి:
ఒక అభిమాని,మీరు ఎప్పుడు ప్రభాస్‌తో నటిస్తారు?అని అడగడంతో పాటు,ఒకవేళ మీరిద్దరూ నటిస్తే వచ్చే హంగామాను తట్టుకోలేక థియేటర్‌కు నా శవాన్ని తీసుకెళ్లండి అని ఫన్నీగా కామెంట్ చేశాడు.దీనికి స్పందించిన రష్మిక,నాకు కూడా ప్రభాస్‌తో నటించాలని ఉంది” అని చెప్పింది.
కెరీర్ పై ఆశ :
ఆమె తన అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా చెబుతూ,ఆయన ప్రభాస్ చాలా మంచి నటుడు.ఆయనతో నటిస్తే నా కెరీర్ వేరే స్థాయిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను అని చెప్పింది.
ఈ వ్యాఖ్యలు చేస్తూ,రష్మిక తన సందేశాన్ని ప్రభాస్ గారు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.తన కోరిక నెరవేరి,త్వరలో ఇద్దరూ కలిసి ఏదైనా ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లో పనిచేయాలని ఆమె ఆశ వ్యక్తం చేసింది.
