D Spiritual: Nov 4: సంవత్సరంలోని అన్ని మాసాలలో అత్యంత విశిష్టమైనది కార్తీక మాసం. ఈ పుణ్యకాలంలో శివుడు, కేశవుడు ఒకే రూపంలో అనుగ్రహిస్తారని, ఈ నెలలో చేసే ఆరాధన అపారమైన ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. కార్తీక పురాణంలో చెప్పినట్లుగా, ఈ మాసంలో జరిగే దీపారాధనలు, అభిషేకాలు, దానధర్మాలు సాధారణ కాలంలో చేసిన పుణ్యకార్యాల కంటే కోటిగుణాల ఫలితాన్ని అందిస్తాయని పేర్కొంటారు.

పురాణాల ప్రకారం, ఈ నెలలో పరమశివుడు విష్ణురూపంలో దర్శనమిస్తాడు, విష్ణుమూర్తి శివస్వరూపంలో అనుగ్రహిస్తాడు. అందువల్ల ఈ మాసంలో “శివ–కేశవులు భిన్నులు కారరు” అనే తత్త్వాన్ని మనం ఆచరణలో అనుభవిస్తామని పండితులు చెబుతున్నారు. ఎవరు ఈ మాసంలో భక్తిశ్రద్ధలతో శివుని గాని, కేశవుని గాని ఆరాధిస్తారో వారు జీవితంలో అపారమైన పుణ్యాన్ని పొందుతారని వారు చెప్పారు.

కార్తీక సోమవారాలు ఈ మాసానికి ప్రత్యేక శోభను ఇస్తాయి. అభిషేక ప్రియుడైన పరమశివుడికి ఈ రోజుల్లో అభిషేకం చేసి, మారేడు దళాలతో అర్చన చేస్తే ఆయన అత్యంత ప్రీతిపాత్రుడవుతాడని పండితులు చెబుతున్నారు. ఒక మారేడు దళాన్ని కూడా మనస్ఫూర్తిగా సమర్పిస్తే అనేక జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. దళం సమర్పించాలనే సంకల్పమే పాప విమోచనానికి దారి తీస్తుందని వారు పేర్కొన్నారు.

మారేడు దళం కేవలం శివార్చనకే కాదు, శ్రీమహావిష్ణువుకూ అత్యంత ప్రీతిపాత్రమైనది. సాధారణంగా మూడు ఆకులతో ఉండే మారేడు దళం “త్రిగుణాత్మక”మైనదిగా భావిస్తారు. ఆ మూడు ఆకులు — సత్యం, జ్ఞానం, అనంతం — అనే పరమాత్మ స్వరూపాన్ని సూచిస్తాయని పండితులు వివరించారు. ఈ దళాన్ని వేరు చేయకుండా సమర్పిస్తే భక్తుడు విశేషమైన ఫలితాలను పొందుతాడని అన్నారు.

తొమ్మిది ఆకులతో ఉండే దళాన్ని “అతి మారేడు దళం” అని పిలుస్తారు. దానిని సమర్పించిన భక్తుడికి మరింత ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. భక్తుడి శ్రద్ధ, విశ్వాసమే పరమాత్మకు ముఖ్యమైనవి. భక్తి ఏ రూపంలోనైనా, ఏ విధంగానైనా వ్యక్తమైతే, దానిని పరమేశ్వరుడు సంతోషంగా స్వీకరిస్తాడని పండితులు చెప్పారు.

కార్తీకమాసంలో దీపదానం, తులసీదళార్పణం, మారేడు దళార్పణం వంటి ఆచారాలు కేవలం పూజా విధులు మాత్రమే కాకుండా, మనసును పవిత్రం చేసే ఆధ్యాత్మిక యాత్ర అని పండితులు పేర్కొన్నారు. ఈ మాసం భక్తుని మనసులో శాంతిని నింపి, ఆత్మను ధర్మమార్గంలో నడిపి, ఐశ్వర్యం, ఆనందం, సౌభాగ్యం కలిగించే శక్తిని కలిగి ఉందని వారు వివరించారు.

ఇతర ఆధ్యాత్మిక పండితులు కూడా ఈ నెలలో శివాలయాల్లో దీపములు వెలిగించడం, కేశవాలయాల్లో తులసీదళం సమర్పించడం వలన కుటుంబంలో శుభం, ఆరోగ్యం, సౌఖ్యం పెరుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం అత్యంత పుణ్యప్రదమని పండితులు తెలిపారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana