
DET:NOV 04:
హక్ సినిమా: తొలి స్పందన ఎమ్రాన్,యామీల నటన అద్భుతం!
సినిమాపై ఆసక్తి పెంచుతున్న ట్రైలర్:
ఎమ్రాన్ హాష్మీ మరియు యామీ గౌతమ్ జంటగా నటించిన ‘హక్’ సినిమాపై బాలీవుడ్లో మంచి చర్చ జరుగుతోంది.ముఖ్యంగా సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి,ఇది షా బానో కేసు వంటి సున్నితమైన సామాజిక అంశాన్ని ధైర్యంగా ప్రస్తావించడం పట్ల అందరూ మెచ్చుకుంటున్నారు.కోర్టు డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యామీ గౌతమ్ నటనకు ప్రశంసలు:
ఈ చిత్రంలో యామీ గౌతమ్ పోషించిన పాత్రకు విపరీతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.ఆమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిందని,ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో,న్యాయం కోసం పోరాడే స్త్రీ పాత్రలో షీ స్టోల్స్ ది షో ఆమె అందరినీ డామినేట్ చేసింది,అని రివ్యూలు చెబుతున్నాయి.ఆమె పాత్రలోని ధైర్యం,నిబద్ధత ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయంటున్నారు.
ఎమ్రాన్ హాష్మీ పాత్ర తీరు:
ఎమ్రాన్ హాష్మీ ఈ చిత్రంలో ఒక న్యాయవాది పాత్రలో కనిపించబోతున్నారు.యామీ గౌతమ్‌తో స్క్రీన్‌ను పంచుకోవడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని,ఆమె నటన నుండి తాను కూడా ఎంతో నేర్చుకున్నానని ఎమ్రాన్ స్వయంగా చెప్పారు.వీరిద్దరి మధ్య వచ్చే కోర్టు సన్నివేశాలు చాలా తీవ్రంగా మరియు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది.
సామాజిక సందేశం బలంగా ఉంది:
హక్ సినిమా కేవలం వినోదం కోసమే కాకుండా,నేటికీ దేశంలో చర్చనీయాంశంగా ఉన్న ముస్లిం పర్సనల్ లా మరియు యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి అంశాలను తాకుతుందని సమాచారం.స్త్రీల హక్కులు,సమానత్వం కోసం జరిగే పోరాటాన్ని ఇది హైలైట్ చేస్తుందని,అందుకే ఈ సినిమాకు తప్పక చప్పట్లు కొట్టాలని తొలి స్పందనలు వినిపిస్తున్నాయి.
