D Spiritual: Oct 31: సాధారణంగా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి. కానీ కొందరిని మాత్రం ఈ కష్టాలు జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి.

అలాంటి వారు ఏం పని చేసినా అసలు కలిసి రాదు. ఇలాంటి వారికి శని దోషం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అందరూ ఈ సృష్టిలో శని అంటే ఇబ్బందులు కలిగించే గ్రహం అని భావిస్తారు. ఒకసారి శని ఆవహిస్తే దాదాపు ఏడు సంవత్సరాల పాటు దూరం కావడం కష్టమని అనుకుంటారు.

ఎవరికైనా వారు చేసిన తప్పుల వల్ల కర్మ ఫలితాలను అనుభవింపజేసేవాడు శని అని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మనిషి మీద శని ప్రభావం తగ్గాలంటే, తప్పకుండా శనీశ్వరునికి పూజ చేయాలి అని చెబుతున్నారు. శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన పనులు చేయడం వల్ల ఆ ప్రభావం నుంచి త్వరగా బయటపడవచ్చు అని కూడా సూచిస్తున్నారు.

శనీశ్వరుని అనుగ్రహం కలిగితే, పూర్తిగా శని ప్రభావం దూరమవుతుంది అని నమ్మకం ఉంది. అందుకోసం శని దేవుడికి ఎంతో ఇష్టమైన వాటిలో శివలింగ పూజ ఒకటి అని పండితులు చెబుతున్నారు.

శని దేవుడిని ఈశ్వరుని అంశంగా భావించి శనీశ్వరుడిగా పూజలు అందుకుంటాడు అని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. ఇంకా చెప్పాలంటే, శనికి ఎంతో ఇష్టమైన శివలింగాభిషేకం చేయడం వల్ల శని దోషాలు దూరం అవుతాయని పండితులు పేర్కొంటున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana