
DSports 30 Oct:ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్ కమ్యూనిటీని విషాదంలో ముంచెత్తుతూ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మెల్బోర్న్కు చెందిన యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ ప్రాక్టీస్ సెషన్లో బంతి తగిలి మరణించాడు. ఆసీస్ క్రికెట్‌కు ఇది చాలా కాలం తర్వాత జరిగిన మరో పెద్ద విషాదం.
క్రికెట్ ఆస్ట్రేలియా (CA) మరియు క్రికెట్ విక్టోరియా (CV) లు బెన్ కుటుంబానికి మరియు అతడి క్లబ్‌కు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఈ యువ క్రికెటర్ మరణం, నెట్స్ ప్రాక్టీస్‌లో కూడా నెక్ గార్డ్ వంటి రక్షణ పరికరాల వాడకంపై మరోసారి చర్చను లేవనెత్తింది.
