
DSports 30 Oct:జార్‌బ్రుకెన్ (జర్మనీ): జర్మనీలోని జార్‌బ్రుకెన్‌లో జరుగుతున్న హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారతీయ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. యువ సంచలనం లక్ష్యసేన్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ముందంజ వేయగా, ప్రపంచ మాజీ నెంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు మాత్రం తొలి రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది.
లక్ష్యసేన్, శంకర్ ముత్తుసామి మధ్య జరగబోయే ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో ఎవరు గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటారో వేచి చూడాలి.
