D Spiritual: Oct 30: వాస్తు చిట్కాలు:
ప్ర‌తి వ్య‌క్తి త‌న ఇల్లు సుఖ‌సంతోషాల‌తో, సంప‌ద‌తో క‌ళ‌క‌ళ‌లాడాల‌ని కోరుకుంటారు. కానీ కొన్ని పొర‌పాట్లు చేయ‌డం కార‌ణంగా అవి జ‌ర‌గ‌వు. అంటే, వాస్తు పరంగా కొన్ని నియమాలు పాటిస్తేనే ఆ ఇంట్లో అష్టైశ్వ‌ర్యాలు సమ‌కూరుతాయి.
సంప‌ద (Wealth), సంతోషం (Happiness) కల‌గాలంటే ప్రతి ఇంట్లో ఈ ఐదు వస్తువులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు తప్పక సంతోషానికి, సంపదకు ఆ ఇంట్లో కొదవ ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మరి ఆ ఐదు వస్తువులు ఏంటో తెలుసుకుందాం —

1. తులసి మొక్క (Tulasi Plant)
ప్రతి ఇంటి ముందూ తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి మొక్క వద్ద పూజలు చేయడం వలన ప్రతికూల శక్తి తొలగి, సానుకూల శక్తి పెంపొందుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
దీంతో ఆ ఇంట్లో సంపద పెరిగి, సంతోషాలు వెల్లివిరుస్తాయట. అయితే తులసిని ఇంటి ఆవరణలో ఈశాన్యం లేదా తూర్పు దిశలో పెట్టడం మంచిదని వారు సూచిస్తున్నారు.

2. వెదురు మొక్క (Bamboo Plant)
వాస్తు శాస్త్రంలో వెదురు మొక్కకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇది చాలా మందికి ఇంట్లో కనిపించదు కానీ ప్రతి ఇంట్లో వెదురు మొక్కను ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
వెదురు మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగి, డబ్బు సమకూరుతుందట. అదృష్టానికి చిహ్నమైన ఈ మొక్కను లివింగ్ రూమ్‌లో ఆగ్నేయ దిశలో ఉంచడం వలన ఆర్థికంగా కలసివస్తుందంట.

3. తాబేలు (Tortoise)
తాబేలు విగ్రహాలను చాలా మంది తమ నివాసాలల్లో, కార్యాలయాల్లో ఉంచుకుంటారు. సంపదకు, స్థిరత్వానికి చిహ్నమైన తాబేలు విగ్రహాలను ఇంట్లో ఉంచడం వలన ఆ ఇంట్లో సంపద పెరుగుతుందట.
అదృష్టం కూడా కలిసివస్తుందట. దీన్ని ఉత్తర దిశలో ఉంచడం వలన అన్ని విధాలా కలిసివస్తుందంట వాస్తు నిపుణులు చెబుతున్నారు.

4. లాఫింగ్ బుద్ధ (Laughing Buddha)
ఇల్లు నిత్యం సుఖసంతోషాలతో వెల్లివిరియాలంటే లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
లాఫింగ్ బుద్ధ వలన ఆ ఇంట్లో అదృష్టం వరిస్తుందట. శ్రేయస్సు, సానుకూల శక్తి పెరుగుతుందట. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం చాలా మంచిదని చెబుతున్నారు.

5. చేపల అక్వేరియం (Fish Aquarium)
ఇంట్లో అక్వేరియం ఉంచుకోవడం వలన ఇంటి వాతావరణం హాయిగా ఉంటుంది. ఇది ఇంట్లో సానుకూలతను పెంచుతుంది.
చేపల కదలికలు జీవితంలో పురోగతి మరియు సంపద ప్రవాహాన్ని సూచిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana