
D Educt: Oct 11: ఏపీ పీజీఈసెట్లో 21.9 శాతం సీట్లే భర్తీ
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసెట్లో కన్వీనర్ కోటా కింద కేవలం 21.9 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తం 16,405 సీట్లు అందుబాటులో ఉండగా, వీటిలో 3,598 సీట్లు మాత్రమే నిండాయి. ఇంకా 12,745 సీట్లు మిగిలిపోయాయి.
ఎంటెక్ కోర్సులో మొత్తం 12,091 సీట్లు ఉండగా, 2,341 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక ఎంఫార్మసీ కోర్సులో 4,314 సీట్లు అందుబాటులో ఉండగా, 1,248 సీట్లు నిండాయి.
మరోవైపు, క్రీడా కోటా కింద 62 సీట్ల కేటాయింపును అధికారులు పెండింగ్లో పెట్టారు. పీజీఈసెట్ ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియలో గణనీయమైన సంఖ్యలో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
