D Educt: Sept 21: బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ క్రెడిట్ విభాగాల్లో మొత్తం 1,100 రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 1,000 వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 100 క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా ఎంబీఏ/పీజీ పూర్తి చేసి సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. 01.09.2026 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.93,960 వరకు వేతనం లభిస్తుంది. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175 దరఖాస్తు రుసుము చెల్లించాలి.

అభ్యర్థులు సెప్టెంబరు 24, 2026 నాటికి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.