
DNews:17 NOV:హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించారు. సోమవారం ఉదయం సంధ్య కన్వెన్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన పలు అనధికార నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.
ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయంటూ స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన అధికారులు భారీ క్రేన్లు, యంత్రాలతో షెడ్లు సహా అనధికార నిర్మాణాలను నేలమట్టం చేశారు.
భారీ పోలీస్ బందోబస్త్ మధ్య ఈ కూల్చివేతలు చేపట్టగా, గతంలో కూడా ఇదే ప్రదేశంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే.
➡ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
