
DNews:20 Nov:మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై చిత్తూరు నుండి హైదరాబాద్‌కు వస్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు, ముందుగా వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.
ఢీకొట్టిన ప్రభావంతో ట్యాంకర్ నుంచి దట్టమైన పొగలు వెలువడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురై బస్సు నుంచి వెంటనే బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పొగలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదం సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు.
