DNews:15 NOV:తెలంగాణలోని గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో, సఖి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో, గురుకులాల్లో మాసిక వ్యర్థ నిర్వహణను (Menstrual Waste Management) ప్రోత్సహించే దిశగా స్మోక్‌లెస్ సైకిల్ – పాత్ టు జీరో వెస్ట్’ అనే కార్యక్రమాన్ని నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ప్రారంభించారు.

ఈ పర్యావరణ హితమైన వ్యర్థ నిర్వహణ యూనిట్‌ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నార్సింగి మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి, కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు వరంగల్‌కు చెందిన ఎస్ఆర్ ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్ మద్దతుతో నిర్వహించారు.

ఈ సందర్భంగా నార్సింగి మున్సిపాలిటీ కమిషనర్ టి కృష్ణమోహన్ మాట్లాడుతూ, విద్యార్థినుల ఆరోగ్యం, పర్యావరణ రక్షణకు మద్దతుగా స్మోక్ ఫ్రీ, ఎమిషన్-కంట్రోల్ పరిష్కారాన్ని అందించినందుకు సఖి టెక్నాలజీస్‌ను అభినందించారు. ఈ ‘స్మోక్‌లెస్ సైకిల్’ కార్యక్రమం పాఠశాలలో మాసిక వ్యర్థ నిర్వహణను సులభతరం చేసి, విద్యార్థుల కోసం మరింత సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సఖి టెక్నాలజీస్ వ్యవస్థాపకురాలు టూటి సంధ్య, సహ-వ్యవస్థాపకులతో పాటు, పాఠశాల ప్రిన్సిపాల్ పి. సుజాత, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana