
DNews:12 Dec: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం అయిన రంగారెడ్డి గూడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారు గెలుపొందడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామంలో మొత్తం పోలైన ఓట్లు 972.కాంగ్రెస్ అభ్యర్థి అంజలి — 459 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి — 490 ఓట్లు. మొదటి లెక్కింపులో రేవతికి 6 ఓట్ల మెజారిటీ వచ్చినా, అధికార పార్టీ నాయకుల డిమాండ్‌పై నిర్వహించిన రీకౌంటింగ్‌లో ఆమె మెజారిటీ 31 ఓట్లకు పెరిగింది. దీంతో బీజేపీ విజయం స్పష్టమైంది.తన స్వగ్రామంలో సొంత పార్టీ కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీయడంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు:
సర్పంచ్ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా జరుగుతాయని, ప్రజలు తమకు మంచి చేస్తారని భావించే వారినే గెలిపించుకుంటారని అన్నారు.ఇక్కడ బీఆర్‌ఎస్ మరియు బీజేపీ చేతులు కలిపాయని ఆయన ఆరోపించారు.గెలిచిన అభ్యర్థి గతంలో రెండుసార్లు ఓడిపోయారని, అందువల్ల ఈసారి సింపతీ కోసం వారికి ఓటు వేశారని చెప్పారు.ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బరిలో నిలిచి ఉంటే, ఆయనకు 13 ఓట్లు మాత్రమే వచ్చేవని అనిరుద్ రెడ్డి అన్నారు.తనను ‘డౌన్’ చేసేందుకు బయటి నుంచి కొన్ని శక్తులు వారి వెనుక ఉండి నడిపించాయని ఆరోపించారు.తాను ఎమ్మెల్యేగా మిగతా గ్రామాలపై ఫోకస్ చేశానని, తన సొంత గ్రామంలో తనకు సపోర్టు చేస్తారు కదా అని భావించి కొంత నిర్లక్ష్యం కూడా తన వైపు నుంచి జరిగిందని అంగీకరించారు.మెజారిటీ గ్రామాల్లో బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు లేరని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
