
DNews:06 Dec: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబా తయారీపై పోలీసులు గట్టిగా చీమకుట్టారు. శనివారం లంబాడీతండా (D) గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న గుడుంబా స్థావరాలపై ఎస్సై గంగారాం సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు జరిపారు.తనిఖీల సందర్భంగా పోలీసులు 1,500 లీటర్ల బెల్లం పానకం, గుడుంబా తయారీలో ఉపయోగించే పరికరాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. గ్రామంలో అక్రమ మద్యం తయారీ జరుగుతున్నట్టు సమాచారం రావడంతో ఈ చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.దాడుల అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన ఎస్సై గంగారాం, గ్రామంలో గుడుంబా తయారీ లేదా విక్రయం జరిగినా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంపై నిరంతరం నిఘా ఉంచి ఇటువంటి అక్రమ కార్యకలాపాలను అణగదొక్కడానికి చర్యలు కొనసాగుతాయని చెప్పారు.
