
DNews:25 Nov:సికింద్రాబాద్ రైల్వే డివిజన్లోని కాజీపేట రైల్వే జంక్షన్–బలార్షా సెక్షన్లో పెద్ద ఎత్తున రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో మొత్తం 22 రోజుల పాటు పలు ప్రయాణికుల రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లిస్తూ నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.మందమర్రి రైల్వే స్టేషన్లో మూడో లైన్‌కు సంబంధించిన నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున.జనవరి 24 నుండి ఫిబ్రవరి 14 వరకు ఈ సెక్షన్‌పై రైళ్ల రాకపోకలను నిలిపివేయడం, మార్గం మార్చడం జరుగుతుంది.
ఈ పనుల కారణంగా ప్రతి రోజూ, రెండు–మూడు రోజులకు ఒకసారి నడిచే వారాంతర రైళ్లతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నగరాల నుంచి వచ్చే అనేక దీర్ఘదూర రైళ్లు ప్రభావితమవుతాయి.దారి మళ్లించబడే / రద్దు అయ్యే రైళ్లు ప్రధానంగా ఈ కేంద్రాల నుంచి నడిచేవి: 1.తిరువనంతపురం, 2.కన్యాకుమారి, 3.బెంగళూరు, 4.యశ్వంతపూర్, 5.హుబ్లీ, 6.చెన్నై, 7.కలకత్తా, 8.ముంబై, 9.న్యూఢిల్లీ, 10.జమ్ముతావి, 11.బిలాస్పూర్, 12.వారణాసి, 13.దానాపూర్
ఈ రైళ్లు కాజీపేట–బలార్షా సెక్షన్ బదులుగా సికింద్రాబాద్, నిజాంబాద్, అకోలా, ఇటార్సీ, నాగపూర్ వంటి మార్గాలపై దారి మళ్లించి నడిపించనున్నారు.ఉల్లేఖించిన తేదీలలో రద్దు అయిన, మార్గం మార్చిన రైళ్ల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణాల్ని ప్లాన్ చేసుకునే ముందు రైల్వే వెబ్సైట్/అప్‌లో తాజా సమాచారం చెక్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
