
DNews:26 Dec: తెలంగాణ రాజకీయాల్లో చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత అనిల్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.సంగారెడ్డి జిల్లాకు చెందిన అనిల్ రెడ్డి, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ విధానాలు నచ్చి తాను పార్టీలో చేరుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. అనిల్ రెడ్డి చేరికతో సంగారెడ్డి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
