
DNews:13 Feb: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థిని కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారనే ఆరోపణలు రావడంతో రాజకీయం వేడెక్కింది.ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థి వినోద్‌ను, కాంగ్రెస్ నాయకులు బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. ఫలితాలు వెలువడిన వెంటనే జరిగిన ఈ ఘటనతో నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరిగినప్పటికీ వారు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో అధికార పార్టీ ఒత్తిడి పెంచుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.తెలంగాణవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిస్తోంది. ప్రధాన మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.
