DNews:OCT 30:ధర్మారం, అక్టోబర్ : ఆల్ ఇండియా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఎర్రం సంజీవ్ నియమితులయ్యారు.

గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త విజయ భాస్కర్ చేతుల మీదుగా సంజీవ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎర్రం సంజీవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి, వారి హక్కుల సాధన కోసం, మంచి సమాజ నిర్మాణానికి, అన్యాయాలపై పోరాటం చేస్తానని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో డోంగ్లి శ్రీనివాస్, బెల్లంకొండ జ్యోతి గౌడ్, కొత్వాల్ సంతోష, షేక్ ఎజాజ్ పాషా, మంద ఆనంద్ మురళి, కాకుమాను మెర్సీ జ్యోతి, గంజి శశి కుమారి, పోలంకి జగదీష్ కుమార్, బాణాల ప్రేమలత, పోలంకి ఉషారాణి, మంద లావణ్య తదితరులు పాల్గొన్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana