DNews:11 Feb: హైదరాబాద్ మహానగర పాలనను మరింత మెరుగుపరిచి, పౌర సేవలను వేగవంతం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ (GHMC)ని మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించింది. ఈ విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి జి. శ్రీజన నేడు బాధ్యతలు స్వీకరించారు. మాదాపూర్‌లోని కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆమె తన బాధ్యతలను చేపట్టారు.

సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి ఐటీ కారిడార్‌తో పాటు వెస్ట్ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు రానున్నాయి. ఈ ప్రాంతంలోని మౌలిక సదుపాయాల కల్పన, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, వ్యర్థాల నిర్వహణ మరియు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి వంటి ప్రధాన సవాళ్లు కొత్త కమిషనర్ ముందు ఉన్నాయి. 2013 బ్యాచ్‌కి చెందిన శ్రీజన గతంలో విశాఖపట్నం (GVMC) కమిషనర్‌గా, కర్నూలు మరియు ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

ఈ కార్యక్రమంలో మూడు నూతన కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారిగా (Special Officer) నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు. కాగా, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించగా, ఆర్వీ కర్ణన్ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana