
DSports:OCT 30 :నవీ ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ గురువారం (అక్టోబర్ 30) నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రారంభమైంది. ఈ కీలక పోరులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
కంగారూల జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. జార్జియా వేర్‌హామ్ స్థానంలో సోఫీ మోలినెక్స్ జట్టులోకి వచ్చింది. మరోవైపు భారత జట్టు కూడా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన ప్రతీక రావల్ స్థానంలో షెఫాలీ వర్మ జట్టులోకి రాగా, రిచా ఘోష్ తిరిగి జట్టులో చేరింది. హర్లీన్ డియోల్ స్థానంలో క్రాంతి గౌడ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చింది.
2017లో డెర్బీలో జరిగిన సెమీఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (115 బంతుల్లో 171 నాటౌట్) ఆస్ట్రేలియాపై ఆడిన హిస్టారికల్ ఇన్నింగ్స్ గుర్తుకు వస్తోంది. అదే ధాటితో ఇప్పుడు కూడా టీమ్ ఇండియా కంగారూలను మట్టికరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత మహిళల జట్టు తొలిసారిగా ఐసీసీ ట్రోఫీ గెలుచుకునే దిశగా అడుగు వేస్తుంది.
భారత్ మహిళల జట్టు (Playing XI):
షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమంజోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
ఆస్ట్రేలియా మహిళల జట్టు (Playing XI):
ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎలిస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్.
