
DNews:05 Dec:బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం హవాలా రాకెట్‌పై పోలీసులు పెద్ద దాడి నిర్వహించారు. గత కొద్దికాలంగా హవాలా డబ్బులు సరఫరా చేస్తున్న ముగ్గురిపై నిఘా పెట్టిన పోలీసులు, పక్కా సమాచారంతో ముంబై, గుజరాత్ దిశగా భారీ మొత్తంలో నగదు రాబోతుందన్న సమాచారాన్ని అందుకున్నారు.
ఈ నేపథ్యంలో మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద బలగాలను మోహరించిన పోలీసులు, వాహనాల తనిఖీలు ప్రారంభించారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులను వెంటాడి పట్టుకున్నారు. అనంతరం వాహనాలను బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి సమగ్రంగా పరిశీలించారు.
ఈ తనిఖీల్లో సుమారు రూ. 4 కోట్లు 5 లక్షల హవాలా నగదు సంచులలో దొరికింది. పాత ₹10 నోట్ల కోడ్ ఆధారంగా ఈ రవాణా జరుగుతున్నట్లు ప్రాథమిక వెల్లడనలు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ హవాలా రాకెట్ వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ అరెస్ట్‌తో హైదరాబాద్‌లో హవాలా డబ్బుల ప్రవాహంపై మరోసారి దృష్టి నిలిచింది.
