
DNews:19 Dec: రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) తెలంగాణ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా మందుల విక్రయం, గడువు మించిపోయిన ఔషధాల నిల్వ, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ అమ్మకం వంటి ఉల్లంఘనలు వెలుగుచూశాయి.ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించిన పలువురు మెడికల్ షాపుల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోపు సమాధానం ఇవ్వకపోతే లైసెన్సు సస్పెన్షన్ లేదా రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఏ హెచ్చరించింది.
డీసీఏ తెలిపిన ముఖ్యాంశాలు:గడువు మించిన మందుల విక్రయం నేరం ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యూల్ డ్రగ్స్ అమ్మకాలు నిషేధం స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు తప్పనిసరి ఉల్లంఘనలపై జరిమానాలు, లైసెన్సు రద్దు చర్యలు, ప్రజలు అనుమానాస్పద ఔషధాల విక్రయంపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని షాపులపై తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
