
DNews:17 NOV:తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై సుప్రీంకోర్టు స్పీకర్ ప్రసాద్ కుమార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం, మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని వ్యాఖ్యానించింది. “మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా?” అని ప్రశ్నించిన ధర్మాసనం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే స్పీకర్ కాంటెంప్ట్‌కు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని గుర్తుచేస్తూ, “న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి” అని సీజేఐ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. అనంతరం, నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని, ఈ అంశంపై రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశిస్తూ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.
