DNews:06 OCT:హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ఎర్రమంజిల్ ప్రాంతంలో సోమవారం (అక్టోబర్ 6) భారీ ప్రమాదం తప్పింది. స్థానిక పెట్రోల్ బంక్‌లోకి కారును ట్రోల్ కొట్టించేందుకు తీసుకువచ్చిన సమయంలో అకస్మాత్తుగా కార్‌లో మంటలు చెలరేగాయి.

ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పెట్రోల్ బంక్ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో కార్‌లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మంటలను చూసి వారు వెంటనే బయటకు దూకగా, పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పివేశారు.

తక్షణ చర్యల వల్ల పెట్రోల్ బంక్‌లో పెద్ద ప్రమాదం జరగకుండా తప్పింది, దీంతో అక్కడ ఉన్న వాహనదారులు, సిబ్బంది ఉపిరి పీల్చుకున్నారు. మంటలు ఆరిన వెంటనే కారును బంక్ ప్రాంగణం వెలుపలకు తరలించారు.

ఈ ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమిక సమాచారం.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana