
DET:SEP17:
సల్మాన్ ఖాన్ ‘బిగ్ బాస్’ ఆఫర్ను తిరస్కరించిన తను శ్రీ దత్తా:
బాలీవుడ్ నటి తను శ్రీ దత్తా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఆమెకు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న “బిగ్ బాస్” రియాలిటీ షోలో పాల్గొనమని ఆఫర్ వచ్చినట్టు వెల్లడించారు.అంతేకాదు,ఆ ఆఫర్ విలువ సుమారు రూ.1.69 కోట్లు అని తెలిపారు.అయితే,తను శ్రీ దత్తా మాత్రం ఆ భారీ రెమ్యునరేషన్ను సైతం తిరస్కరించారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
తను శ్రీ మాట్లాడుతూ – నాకు బిగ్ బాస్ లాంటి షోలు సరిపడవు.నేను ఆ వాతావరణంలో సౌకర్యంగా ఉండలేను.డబ్బు ఎంత ఇచ్చినా,నాకు మనశ్శాంతి ముఖ్యం.అందుకే ఆ ఆఫర్ను నిరాకరించాను అని చెప్పారు.
2004లో మిస్ ఇండియా యూనివర్స్గా కీర్తి తెచ్చుకున్న తను శ్రీ, బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు.తర్వాత సినిమాల నుంచి కొంత దూరమయ్యారు.కానీ అప్పుడప్పుడూ తన ధైర్యవంతమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు.ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్ తిరస్కరించడం కూడా ఆమె నిర్ణయాల్లో ఒక ప్రత్యేకమైనదిగా మారింది.
